ఈనెల 25న కాకినాడలో సీఎం జగన్ పర్యటన
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఈ నెల 25న ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు. ఉప్పాడ కొత్తపల్లి మండలం కొమరిగిరిలో పేదలకు ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించనున్నారు. కాకినాడ పరిధిలో 16 వేల మంది పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డితో పాటు జిల్లా అధికారులు పరిశీలించారు.
Next Story




