Andhra Pradesh: ఇవాళ వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

Andhra Pradesh: పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ

Sandeep Eggoju
Published on: 15 July 2021 7:32 AM IST
AP CM Jagan To Hold YCP Parliamentary Party Meeting Today
X
 ఎంపీలతో నేడు సీఎం జగన్ మీటింగ్ (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన ఇవాళ వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి వైసీపీ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు హాజరుకావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. త్వరలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సమావేశం జరగనుంది. సమావేశాల్లో అనుసరించే వ్యూహాలపై చర్చించనున్నారు. రాష్ట్రానికి సంబంధించి పలు సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమగ్రంగా చర్చించనున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలను ఖరారు చేయనున్నారు.

పోలవరం ప్రాజెక్టు పెండింగ్ నిధుల విడుదల, కృష్ణా జలాల వివాదం, రాష్ట్రంలో పలు పెండింగ్ ప్రాజెక్టుల పుర్తి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల అంశాలను ప్రస్తావించే అంశంపై ఎజెండా ఖరారు చేయనున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల విడుదల, కొవిడ్ దృష్ట్యా అదనంగా ఆర్థిక సాయం, రుణ పరిమితి తగ్గింపు అంశం, ప్రత్యేక హోదా సహా తదితర అంశాల ప్రస్తావన సహా పోరాటం చేసే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story