ప్రకాశం జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

CM Jagan: వైఎస్సార్, బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహాలు ఆవిష్కరించనున్న జగన్

Jyothi
Published on: 24 Aug 2022 7:31 AM IST
AP CM Jagan to Chimakurthy in Prakasam District Today
X

ప్రకాశం జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన 

CM Jagan: సీఎం జగన్ ఇవాళ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. చీమకుర్తి మెయిన్ రోడ్డులోని బూచేపల్లి కల్యాణమండపం వద్ద వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డిల కాంస్య విగ్రహాలను సీఎం జగన్ ఆవిష్కరిస్తారు. అనంతరం BVSR ఇంజినీరింగ్ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. సీఎం జిల్లాకు వస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎస్పీ మల్లికా గార్గ్ స్వయంగా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఎస్పీతో పాటు వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త బాలినేని శ్రీనివాసరెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కూడా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

Jyothi

Jyothi

Next Story