తప్పు చేసింది ఎవరైనా ఉపేక్షించొద్దు : సీఎం జగన్

X
Highlights
పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు ఏపీ సీఎం జగన్. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన పోలీసు సంస్మరణ...
Arun Chilukuri21 Oct 2020 6:27 AM GMT
పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు ఏపీ సీఎం జగన్. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన పోలీసు సంస్మరణ దినోత్సవ సభలో పాల్గొన్న సీఎం జగన్ గౌరవ వందనం స్వీకరించారు. పోలీసు అమరవీరులను గుర్తు చేసుకున్నారు. ఇక దేశాభివృద్ధికి తలసరి ఆదాయం కంటే శాంతి భద్రతలే ముఖ్యమన్నారు ఏపీ సీఎం జగన్. నేరాలను తగ్గింపు మహిళల భద్రత కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తప్పు చేసింది ఎవరైనా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దని పోలీసులకు సూచించారు సీఎం జగన్. దిశ చట్టానికి త్వరలోనే ఆమోదం వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
Web TitleAP CM Jagan Speech in Police Commemoration Day in Vijayawada
Next Story