Jagan: చంద్రబాబు తప్పుడు పనుల వల్లే.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆలస్యం..

AP CM Jagan Slams Chandrababu About Polavaram Project
x

Jagan: చంద్రబాబు తప్పుడు పనుల వల్లే.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆలస్యం..

Highlights

AP Assembly Sessions: చంద్రబాబు తప్పుడు పనుల వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆలస్యం అయ్యాయని సీఎం జగన్‌ తెలిపారు.

AP Assembly Sessions: చంద్రబాబు తప్పుడు పనుల వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆలస్యం అయ్యాయని సీఎం జగన్‌ తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి 2వేల 900 కోట్లు రావాల్సి ఉందన్నారు. టీడీపీ నిర్వాకంతోనే 2వేల 900 కోట్ల నిధులు నిలిచిపోయాయని జగన్ ఆరోపించారు. ఆనాడే కేంద్రాన్ని నిలదీయాల్సింది పోయి ఇప్పుడు విమర్శిస్తున్నారని మండిపడ్డారు. పోలవరం పనులు.. నిర్వాసితులకు అందిన పరిహార విషయంలో చంద్రబాబుగారి హయాంలో గణాంకాలు.. తమ ప్రభుత్వ గణాంకాలు పరిశీలిస్తే ఎవరికి చిత్తశుద్ధి ఎంత ఉందో స్పష్టం అవుతుందని సీఎం జగన్‌ తెలిపారు.

పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లింపుపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం జగన్‌ వివరణ ఇచ్చారు. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా పోలవరం ప్రాజెక్టు వివరాలు వెల్లడించారు. పోలవరం నిర్వాసితులకు పునరావాస పనులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు సీఎం జగన్‌. గత ప్రభుత్వం 3వేల 73 మందికి పునరావాసం కింద.. 193 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 14వేల 110 మంది నిర్వాసితులకు 19వందల 60కోట్ల 95 లక్షల పునరావాసం పూర్తైందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories