విజయవాడ అత్యాచార, రుయా ఆస్పత్రి ఘటనపై సీఎం జగన్ సీరియస్

YS Jagan: ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి

Rama Rao
Published on: 27 April 2022 5:56 PM IST
AP CM Jagan Serious on Triupati Ruia Ambulance and Vijaywada Incident
X

విజయవాడ అత్యాచార, రుయా ఆస్పత్రి ఘటనపై సీఎం జగన్ సీరియస్

YS Jagan: విజయవాడ అత్యాచార ఘటన, రుయా తిరుపతి రుయా ఆస్పత్రి ఘటనపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు.ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఇలాంటి విషయాల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. అలాగే 107, 104 తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ లపై ప్రజలు నేరుగా ఫిర్యాదు చేసేందుకు వాహనాల మీద ఫిర్యాదు నెంబర్లు ప్రదర్శించాలని సంబంధిత అధికారులను జగన్ ఆదేశించారు. ఈ రెండు ఘటనల వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వస్తుందన్న ఆయన ఇలాంటి ఘటనల కట్టడికి సమర్థవంతమైన ప్రొటోకాల్ ఉండాలన్నారు. ముఖ్యంగా వైద్యం, పోలీసులు, విజిలెన్స్ వ్యవస్థలు ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. అలసత్యం వహించిన బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎట్టిపరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బందిపెట్టే చర్యలు ఉపేక్షించబోమని హెచ్చరించారు సీఎం జగన్.

Rama Rao

Rama Rao

Next Story