CM Jagan: నకిలీ చలాన్ల మాఫియాపై జగన్ సీరియస్

CM Jagan: ఏపీలో నకిలీ చలాన్ల వ్యవహారంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Arun Chilukuri
Updated on: 19 Aug 2021 4:33 PM IST
AP CM Jagan Serious About the Mafia of Fake Challans
X

CM Jagan: నకిలీ చలాన్ల మాఫియాపై జగన్ సీరియస్

CM Jagan: ఏపీలో నకిలీ చలాన్ల వ్యవహారంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోకి నకిలీ చలాన్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఏసీబీ దాడులు చేస్తే తప్ప ఈ వ్యవహారం వెలుగులోకి రాలేదని ఫైర్ అయ్యారు. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని సీఎం ప్రశ్నించారు. తప్పులకు పాల్పడ్డ అధికారులను సస్పెండ్‌ చేశామని జగన్‌కు అధికారులు తెలిపారు. ఈ స్థాయిలో తప్పులకు తప్పులు జరుగుతుంటే ఎందుకు దృష్టికి రాలేదని సీఎం ఫైర్ అయ్యారు. అన్ని కార్యాలయాల్లో చలాన్ల చెల్లింపు ప్రక్రియను పరిశీలించాలన్నారు.

APకి ఆదాయవనరులు అందించే శాఖలపై సీఎం జగన్ సమీక్ష జరిపారు. రావాల్సిన బకాయిలపై దృష్టిపెట్టాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఆదాయ వనరుల పరిస్థితి మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని జగన్ సూచించారు. ఆదాయం వచ్చే కొత్త మార్గాలపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story