Jagan: మూడో విడత విద్యాదీవెన నిధులు విడుదల చేసిన జగన్

రూ.686 కోట్లు విడుదల చేసిన ఏపీ ముఖ్యమంత్రి జగన్

Arun Chilukuri
Published on: 30 Nov 2021 4:04 PM IST
AP CM Jagan Said that Poverty Should not be a Barrier to Education
X

మూడో విడత విద్యాదీవెన నిధులు విడుదల చేసిన జగన్ (ది హన్స్ ఇండియా )

Jagan: చదువులకు పేదరికం అడ్డు కారాదని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఉన్నత చదువులతోనే పేదల తలరాతలు మారుతాయని, అందుకే ప్రతి పేద విద్యార్థికీ చదువు అందేలా పూర్తిగా ఫీజు రీయింబర్స్ మెంట్ ను అందజేస్తున్నామని చెప్పారు. విద్యాదీవెన కింద 11.03 లక్షల మంది విద్యార్థులకు 686 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను ముఖ్యమంత్రి విడుదల చేశారు. కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఫీజు రీయింబర్స్ మెంట్ ను అందిస్తున్నామని, తల్లుల ఖాతాల్లో జమ అయిన డబ్బును కాలేజీలకు తప్పనిసరిగా ఫీజుగా కట్టాలని ఆయన సూచించారు. లేకపోతే నేరుగా కాలేజీలకే చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story