పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ముఖ్యమంత్రి జగన్ కీలక సమీక్ష

X
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ముఖ్యమంత్రి జగన్ కీలక సమీక్ష
Highlights
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ముఖ్యమంత్రి జగన్ కీలక సమీక్ష నిర్వహించారు. యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టు పనులు...
Arun Chilukuri1 March 2021 12:30 PM GMT
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ముఖ్యమంత్రి జగన్ కీలక సమీక్ష నిర్వహించారు. యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు స్పిల్‌వే పనులు ఇప్పటికే పూర్తయినట్లు ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. గేట్లు, సిలిండర్ల బిగింపు పనులు చురుగ్గా జరుగుతున్నాయని వివరించారు. అయితే స్పిల్‌వే ఛానల్, అప్రోచ్‌ఛానల్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. మే నెలాఖరు నాటికి కాపర్ డ్యాం పనులను పూర్తి చేస్తామని అధికారులు జగన్‌కు తెలిపారు. మరోవైపు ప్రాజెక్టు దగ్గర వైఎస్ఆర్ గార్డెన్ నిర్మాణంపైనా సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు దగ్గర జి-హిల్‌సైట్‌పై 100 అడుగుల ఎత్తుతో నిర్మించనున్న విగ్రహ ప్రతిపాదనలు సీఎం జగన్‌కు అధికారులు వివరించారు.
Web TitleAP CM Jagan Reviews Polavaram Project Works
Next Story