logo
ఆంధ్రప్రదేశ్

సీఎం జ‌గ‌న్ కీల‌క ప్రక‌ట‌న.. వ్య‌వ‌సాయ మోటార్ల‌కు మీట‌ర్లు..

AP CM Jagan Reviews on Agriculture Sector
X

సీఎం జ‌గ‌న్ కీల‌క ప్రక‌ట‌న.. వ్య‌వ‌సాయ మోటార్ల‌కు మీట‌ర్లు..

Highlights

Jagan: వ్యవ‌సాయ రంగానికి ఇస్తున్న విద్యుత్‌పై ఏపీ సీఎం జ‌గ‌న్ కీల‌క ప్రక‌ట‌న చేశారు.

Jagan: వ్యవ‌సాయ రంగానికి ఇస్తున్న విద్యుత్‌పై ఏపీ సీఎం జ‌గ‌న్ కీల‌క ప్రక‌ట‌న చేశారు. ఏపీలో త్వర‌లోనే వ్యవ‌సాయ మోటార్లకు మీట‌ర్లు ఏర్పాటు చేస్తామ‌ని ప్రకటించారు. ఈ దిశ‌గా శ్రీకాకుళం జిల్లాలో చేప‌ట్టిన‌ పైల‌ట్ ప్రాజెక్టు విజ‌య‌వంతం అయ్యిందని CM గుర్తు చేశారు. వ్యవ‌సాయ మోటార్లకు మీట‌ర్ల ఏర్పాటు వ‌ల్ల నాణ్యమైన విద్యుత్ అందుతుందన్నారు. రాజ‌కీయ ల‌బ్ధి కోస‌మే సాగు మోటార్లకు మీట‌ర్లపై విప‌క్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయ‌ని జగన్ విమర్శించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఇవాళ వ్యవసాయ శాఖపై జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 16న రైతు భరోసా నిధులు విడుద‌ల చేస్తామన్నారు. జూన్‌ మొదటి వారంలో రైతులకు పంట నష్టపరిహారం పంపిణీ చేస్తామ‌న్నారు. అదే నెలలో 3 వేల ట్రాక్టర్లు సహా, 4 వేల 14 వ్యవసాయ యంత్రాలు పంపిణీ చేస్తామ‌ని తెలిపారు.

Web TitleAP CM Jagan Reviews on Agriculture Sector
Next Story