AP CM Jagan: దేశంలో ఏపీలోనే సంక్షేమ పథకాలు ఘనం..

AP CM Jagan: విశాఖలో ఐటీ హబ్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.

Arun Chilukuri
Updated on: 21 July 2022 5:45 PM IST
AP CM Jagan Review on Sustainable Development
X

AP CM Jagan: దేశంలో ఏపీలోనే సంక్షేమ పథకాలు ఘనం..

AP CM Jagan: విశాఖలో ఐటీ హబ్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ ఉన్నతాధికారులతో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై సమీక్షించారు. విశాఖలో అత్యాధునిక వసతులతో తలపెట్టే ఐటీహబ్ నిర్మాణపనులకు కార్యాచరణ రూపొందించాలన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. ఆరోగ్యశ్రీలో మూడు వేల చికిత్సలను అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారులకు నేరుగా వారిఖాతాల్లోనే లక్షా 65 వేల కోట్లను జమచేశామన్నారు. ప్రభుత్వ పథకాల అమలు తీరూ తెన్నులపై అధికారులు నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story