అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం జగన్ సమావేశం.. తిరుపతి ఉపఎన్నిక అభ్యర్ధి ఎంపికపై..

Arun Chilukuri
Published on: 19 Nov 2020 4:47 PM IST
అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం జగన్ సమావేశం.. తిరుపతి ఉపఎన్నిక అభ్యర్ధి ఎంపికపై..
X

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమయ్యారు. తిరుపతి ఉపఎన్నిక అభ్యర్ధి ఎంపికపై చర్చిస్తున్నారు. దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఫ్యామిలీకే టికెట్ కేటాయించాలని పార్టీ అధిష్టానం భావించినప్పటికీ దుర్గాప్రసాద్‌ కుటుంబ సభ్యులు పోటీకి అంతగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దాంతో, తిరుపతి ఉపఎన్నిక అభ్యర్ధి కోసం మంత్రులు, ముఖ్యనేతలతో సీఎం జగన్ చర్చిస్తున్నారు. అయితే, దివంగత ఎంపీ దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులకే టికెట్‌ కేటాయించాలని సీఎం జగన్ భావిస్తున్నారు. దుర్గాప్రసాద్ భార్య లేదా కుమారుడికి టికెట్ కేటాయించే అవకాశం కనిపిస్తోంది. ఇక, స్థానిక ఎన్నికలు, ఎస్‌ఈసీ నిమ్మగడ్డ వ్యవహార శైలిపైనా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story