Cyclone Yaas: తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష

Cyclone Yaas: ఏపీలో తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష జరిపారు.

Arun Chilukuri
Published on: 25 May 2021 3:00 PM IST
AP CM Jagan Review Meeting With District Collectors on Cyclone Yaas
X

Cyclone Yaas: తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష

Cyclone Yaas: ఏపీలో తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష జరిపారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం కలెక్టర్లతో సమీక్ష జరిపిన సీఎం అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తుపాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వాతావరణశాఖ నివేదికలు పరిశీలించి తుఫాన్ కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు.

సీఎస్‌ ఆదిత్యనాథ్‌ శ్రీకాకుళం జిల్లా నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. శ్రీకాకుళంలో అక్కడక్కడా జల్లులు తప్ప పెద్దగా ప్రభావం కన్పించలేదని సీఎస్‌ తెలిపారు. తాత్కాలిక నిర్మాణాల్లో కోవిడ్‌ రోగులు లేకుండా చర్యలు తీసుకున్నామని విద్యుత్‌కు అంతరాయం లేకుండా జనరేటర్లు, డీజిల్‌ సిద్ధం చేశాం అని ఆదిత్యనాథ్‌ సీఎం జగన్‌కు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story