ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం

Jagan Review Meeting: మే నాటికి గ్రామవార్డు సచివాలయాల్లో ఆధార్‌సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు.

Arun Chilukuri
Updated on: 27 Jan 2022 9:00 PM IST
AP CM Jagan Review Meeting over Village Secretariat
X

ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం

Jagan Review Meeting: మే నాటికి గ్రామవార్డు సచివాలయాల్లో ఆధార్‌సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను రెగ్యులర్‌ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అలాగే ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఉగాది వేళ ఉత్తమ వాలంటీర్లను గుర్తించి సత్కరించి, ప్రోత్సహకాలను అందించాలన్నారు.

గ్రామ, వార్డు సచివాలయాలపై సీఎం జగన్ సమీక్షించారు. ఈ సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్దిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ సమీర్‌ శర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story