Nadu Nedu: నూతన విద్యా విధానానికి కార్యాచరణ రూపొందించాలి- సీఎం జగన్
Nadu Nedu: ఏపీలో నూతన విద్యా విధానానికి కార్యాచరణ రూపొందించాలన్నారు సీఎం జగన్.
సీఎం జగన్(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )
Nadu Nedu: ఏపీలో నూతన విద్యా విధానానికి కార్యాచరణ రూపొందించాలన్నారు సీఎం జగన్. విద్యాశాఖ, అంగన్‌వాడీల్లో నాడు నేడుపై సమీక్ష నిర్వహించిన సీఎం నూతన విద్యా విధానానికి ఖర్చుతో కూడిన అన్ని వివరాలు తయారు చేయాలన్నారు. రెండేళ్లలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయులతో పాటు ఇతర భాగస్వాములకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి కొత్త విద్యావిధానంతో జరిగే మేలును వివరించాలని తెలిపారు. ఆట స్థలం లేని స్కూళ్లకు నాడు నేడు కింద భూమి కొనుగోలు చేయాలన్న సీఎం వచ్చే ఏడాది నుంచి విద్యాకానుకలో స్పోర్ట్స్ డ్రెస్, షూలు ఇచ్చే అంశాలను పరిశీలించాలన్నారు.
Next Story




