CM Jagan: సాగు మోటార్లకు మీటర్ల వల్ల కలిగే లబ్ధిని రైతులకు వివరించాలి..

AP CM Jagan Review Meeting on Electricity Department
x

CM Jagan: సాగు మోటార్లకు మీటర్ల వల్ల కలిగే లబ్ధిని రైతులకు వివరించాలి..

Highlights

Jagan: వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే అంశంపై రైతులకు అవగాహన కల్పించాలని AP CM జగన్ ఆదేశించారు.

Jagan: వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే అంశంపై రైతులకు అవగాహన కల్పించాలని AP CM జగన్ ఆదేశించారు. విద్యుత్‌ శాఖపై ఆయన ఇవాళ సమీక్షించారు. థర్మల్‌ కేంద్రాల వద్ద సరిపడా బొగ్గు నిల్వలు ఉండేలా చూసుకోవాలని సూచించారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. డిమాండ్‌‎కు తగ్గట్టుగా పవర్‌ప్లాంట్లు నడిచేలా చూసుకోవాలన్నారు. శ్రీకాకుళంలో పైలట్‌ ప్రాజెక్ట్‌ విజయవంతమైన తీరు వివరించాలని, మీటర్ల వల్ల 33.75 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఆదా అయిందన్న విషయాన్ని తెలపాలన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు ఉంటే మోటార్లు కాలిపోవని, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా ఉంటుందనే విషయం అన్నదాతలకు తెలియజేయాలనీ జగన్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories