క్రికెట్ బ్యాట్ పట్టిన ఏపీ సీఎం జగన్

Jagan: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి క్రికెట్ బ్యాట్ పట్టి ఆభిమానులను అలరించారు.

Arun Chilukuri
Updated on: 9 July 2021 9:00 PM IST
AP CM Jagan Plays Cricket In Kadapa Stadium
X

క్రికెట్ బ్యాట్ పట్టిన ఏపీ సీఎం జగన్

Jagan: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి క్రికెట్ బ్యాట్ పట్టి ఆభిమానులను అలరించారు. రెండు బంతులను ఆడారు సీఎం. కడప జిల్లాలో పర్యటించిన ఆయన వైఎస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియం అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టారు. ప్లడ్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. దీనిలో భాగంగా సీఎం జగన్ క్రికెట్ బ్యాట్ పట్టి రెండు బంతుల్ని ఆడారు. అనంతరం బ్యాట్, బంతిపై సంతకం చేశారు.

వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో కడప అభివృద్ధి చెందిందని ఆ తర్వాత జిల్లాను ఎవరూ పట్టించుకోలేదని సీఎం జగన్ అన్నారు. ఇన్నాళ్లలో కడపలో అభివృద్ధి జరుగుతుందని హర్షం వ్యక్తం చేశారు. అన్ని రోడ్లను విస్తరిస్తామని సీఎం అన్నారు. కడపను సుందర నగరంగా తీర్చిదిద్ది మంచి నగరాల సరసన చేర్చుతామన్నారు. 125 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం జరుగుతోందని సీఎం జగన్ అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story