Tirumala: శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్‌

Tirumala: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఏపీ సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు.

Arun Chilukuri
Published on: 11 Oct 2021 8:00 PM IST
AP CM Jagan Offers Silk Clothes to Lord Venkateswara at Tirumala
X

Tirumala: శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్‌

Tirumala: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఏపీ సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా తిరుమల చేరుకున్న సీఎం జగన్‌కు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో, మంత్రులు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రికి వేద పండితులు ఆశీర్వచనాలు ఇచ్చారు. టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సీఎంకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం 2022 టీటీడీ క్యాలెండర్‌, డైరీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించారు.

అనంతరం గరుడ వాహన సేవలో సీఎం పాల్గొన్నారు. తిరుపతి, తిరుమలలో పర్యటిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌.. పలు అభివృద్ధి కార్యక్రమాలను సోమవారం ఆయన ప్రారంభించారు. తిరుపతి బర్డ్‌ ఆసుపత్రిలో శ్రీ పద్మావతి చిన్న పిల్లల కార్డియాక్‌ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం అలిపిరి వద్దకు చేరుకున్న సీఎం జగన్‌ శ్రీవారి పాదాల వద్ద నుంచి తిరుమలకు నడక మార్గం, పై కప్పును, గోమందిరాన్ని ప్రారంభించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story