AP Assembly Sessions: బీఏసీలో అచ్చెన్నాయుడికి సీఎం జగన్‌ ఆఫర్‌

AP Assembly Sessions: శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది.

Arun Chilukuri
Updated on: 15 Sept 2022 2:57 PM IST
AP CM Jagan Offer To Atchannaidu In BAC Meeting
X

AP Assembly Sessions: బీఏసీలో అచ్చెన్నాయుడికి సీఎం జగన్‌ ఆఫర్‌

AP Assembly Sessions: శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. బీఏసీ సమావేశంలో పాల్గొన్న సీఎం జగన్‌ టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకి ఆఫర్ ఇచ్చారు. మీరు ఏం అంశం కావాలన్నా చర్చకు మేం రెడీ. సభలో చర్చకు సహకరిస్తారా? లేదా?. మీరు కోరే ప్రతీ అంశంపైనా చర్చిస్తాం. అవసరమైతే ఈఎస్‌ఐ స్కాంపైనా చర్చిద్దాం. రాజధానిది కావాలంటే అది కూడా చర్చ పెడదాం. సభ నిర్వహణను మాత్రం అడ్డుకోవద్దని అచ్చెన్నాయుడితో సీఎం జగన్‌ చెప్పినట్లు తెలుస్తోంది.

ఇక టీడీపీ సభ్యులు తీరుపై బీఏసీలో అభ్యంతరం వ్యక్తం చేశారు మంత్రులు.. మీరు చర్చకు సహకరించకుండా గొడవ చెయ్యడం సమంజసం కాదని హితవుపలికారు. సీఎంను ఏదైనా అంటే ఊరుకునేది లేదని, చంద్రబాబే రెచ్చగొట్టి ఎమ్మెల్యేలను గొడవకు పంపిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story