2024 Elections: జగన్ నయా ఫార్ములా.. ఇంటెలిజెన్స్ లెక్కలతో ఖుషీ ఖుషీ

2024 Elections: వైసీపీ బయటకు దీమాగా ఉంది. ఎలాగైనా ఎన్నికల్లో విజయం సాధిస్తామని విశ్వాసంతో ఉంది.

Arun Chilukuri
Updated on: 9 May 2022 7:30 PM IST
AP CM Jagan New Formula For 2024 Elections
X

2024 Elections: జగన్ నయా ఫార్ములా.. ఇంటెలిజెన్స్ లెక్కలతో ఖుషీ ఖుషీ  

2024 Elections: వైసీపీ బయటకు దీమాగా ఉంది. ఎలాగైనా ఎన్నికల్లో విజయం సాధిస్తామని విశ్వాసంతో ఉంది. అందుకే ఎవరేమైనా చేసుకోనివ్వండి మన ఓట్లు మనకున్నాయని వైసీపీ అధినేత జగన్‌ ఉన్నారు. టీడీపీ, జనసేన పొత్తు లెక్కలపై వైసీపీ ముఖ్యులకు క్లారిటీ ఇచ్చారు జగన్. భవిష్యత్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ముఖ్యలకు జగన్ అన్ని విషయాలు వివరించారు. ఎన్నికల్లో సంక్షేమం గెలిపిస్తోందన్న విశ్వాసంలో ఫ్యాన్ పార్టీ అధినేత ఉన్నారు. నవరత్నాలతో గెలుపు ఖాయమంటున్నారు జగన్.

వచ్చే ఎన్నికల్లో టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ గెలుపు ఖాయమని ప్రశాంత్ కిషోర్ లేకున్నా విజయం వరిస్తుందని భావిస్తున్నారు. ఎన్నికల్లో గెలవడం కోసం గతంలోలా ఈసారి పీకే లేకున్నా అంతా తనై జగన్ కార్యాచరణ సిద్ధం చేశారట. ప్రజల్లోకి వెళ్లండి ప్రజలతో రాజకీయం చేయండని కొన్నాళ్లుగా పార్టీ నేతలకు జగన్ కుండబద్ధలుకొడతున్నారు. టీడీపీ, జనసేనను కార్నర్ చేసేలా ప్రజల్లో ఆలోచన కలిగించాలంటున్నారట. ఇప్పటికే ఇంటెలిజెన్స్ లెక్కలతో జగన్‌ ఖుషీ ఖుషీగా ఉన్నారు. ఒకవేళ ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా అంతిమంగా మరోసారి గెలుపుపై క్లియర్ లెక్కలున్నాయంటున్నారు వైసీపీ నేతలు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story