CM Jagan: ఏపీకి 13 వైద్యకళాశాలలు మంజూరు చేయండి..

CM Jagan: ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది.

Arun Chilukuri
Published on: 30 April 2022 8:39 PM IST
AP CM Jagan Meets Union Health Minister Mansukh Mandaviya
X

CM Jagan: ఏపీకి 13 వైద్యకళాశాలలు మంజూరు చేయండి..

CM Jagan: ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. సీఎం జగన్ ఈ సాయంత్రం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ఏర్పాటుపై కేంద్రమంత్రితో చర్చించారు. ఏపీకి 13 వైద్య కళాశాలలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల తాము 13 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన విషయాన్ని కేంద్రమంత్రికి వివరించారు. ఆయా జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని జగన్ కోరారు. మన్సుఖ్ మాండవీయతో సీఎం జగన్ భేటీ దాదాపు అరగంట పాటు కొనసాగింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story