ముగిసిన గవర్నర్ హరిచందన్‌, సీఎం జగన్ భేటీ.. శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఎన్నికపై..

AP CM Jagan Meeting: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో సీఎం జగన్ భేటీ ముగిసింది.

Arun Chilukuri
Published on: 6 Jun 2022 7:46 PM IST
AP CM Jagan Meeting Ends With Governor Biswabhushan Harichandan
X

ముగిసిన గవర్నర్ హరిచందన్‌, సీఎం జగన్ భేటీ.. శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఎన్నికపై..

AP CM Jagan Meeting: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో సీఎం జగన్ భేటీ ముగిసింది. గవర్నర్‌తో గంటపాటు చర్చించారు జగన్ దంపతులు. సమావేశంలో భాగంగా అసెంబ్లీ సమావేశాలపై గవర్నర్‌తో ముఖ్యమంత్రి జగన్ చర్చించినట్లు తెలుస్తుంది. అదేవిధంగా శాసనసభ స్పీకర్ ఎన్నికపై కూడా చర్చించినట్లు సమాచారం. ఇక ఢిల్లీ పర్యటన, తాజా రాజకీయ పరిస్థితులపై గవర్నర్‌తో సీఎం జగన్ చర్చించారు.

ఈనెల 20 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ఇదే విషయంపై మధ్యాహ్నం సీఎం జగన్‌ను కలిశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. ఈ సందర్భంగా అసెంబ్లీ నిర్వహణ, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అంశంపై చర్చించినట్లు తెలుస్తుంది. ఇక ప్లీనరీకి ముందుగానే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని వైసీపీ సర్కార్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story