ఏపీ మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణకు ముహుర్తం ఖరారు.. గవర్నర్ బిశ్వభూషణ్ కు క్లారిటీ ఇచ్చిన జగన్

Cabinet Reshuffle: ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌తో సీఎం జగన్ అరగంటకు పైగానే భేటీ అయ్యారు.

Arun Chilukuri
Updated on: 6 April 2022 9:00 PM IST
AP CM Jagan Meeting Ends with Governor Biswabhusan Harichandan
X

ఏపీ మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణకు ముహుర్తం ఖరారు.. గవర్నర్ బిశ్వభూషణ్ కు క్లారిటీ ఇచ్చిన జగన్

Cabinet Reshuffle: ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌తో సీఎం జగన్ అరగంటకు పైగానే భేటీ అయ్యారు. వీరి భేటీలో మంత్రివ‌ర్గ పునర్వ్యవ‌స్థీక‌ర‌ణ‌పైనే చర్చ జ‌రిగింది. కేబినెట్ పునర్‌ వ్యవస్థీకరణపై గవర్నర్‌కు జగన్ వివరించారు. ఈనెల 11న మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండడంతో ఆయన అపాయిట్‌మెంట్ కోరారు. ప్రమాణస్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లపై గవర్నర్ కు వివరించారు.

మరోవైపు రేపు ఏపీ కేబినెట్ సమావేశం అవుతోంది. రేపు జ‌రిగే కేబినెట్ భేటీలోనే మంత్రులంద‌రితోనూ రాజీనామాలు తీసుకునే విష‌యంపై గ‌వ‌ర్న‌ర్‌కు వివరించారు. అలాగే కొత్త‌గా మంత్రివ‌ర్గంలోకి తీసుకోబోయే నేత‌లు, పున‌ర్వ్యవ‌స్థీక‌ర‌ణ‌ తరువాత కూడా కొన‌సాగించ‌నున్న మంత్రుల పేర్ల‌ను కూడా గ‌వ‌ర్న‌ర్‌కు వివ‌రించారు. పాత మంత్రుల్లో కొంద‌రిని కొన‌సాగించ‌డానికి గ‌ల కార‌ణాల‌ను కూడా జ‌గ‌న్ గ‌వ‌ర్న‌ర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story