వైఎస్సార్ బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్

X
Highlights
ఏపీ ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. నిరుపేదలకు అండగా వైఎస్సార్ బీమా పథకాన్ని సీఎం జగన్ తాడేపల్లి...
Arun Chilukuri21 Oct 2020 8:05 AM GMT
ఏపీ ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. నిరుపేదలకు అండగా వైఎస్సార్ బీమా పథకాన్ని సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి ప్రారంభించారు. ప్రతీ కుటుంబం సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్న సీఎం కేంద్రం తప్పుకున్నా రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం ఖర్చును భరిస్తుందన్నారు. ఈ పథకాన్ని అత్యంత పారదర్శకంగా అమలవ్వాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. 'వైఎస్సార్ బీమా పథకం' ద్వారా బియ్యం కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరనుంది. కుటుంబ పెద్దకు జీవన భద్రత కల్పించేందుకు తీసుకొచ్చిన ఈ బీమా పథకం ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. కోవిడ్ వల్ల ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ నిరుపేద కుటుంబాలకు మేలు చేయాలన్న సంకల్పంతో వైఎస్సార్ బీమా పథకాన్ని అమలు చేసినట్టు సీఎం జగన్ తెలిపారు.
Web TitleAP CM Jagan launches ysr bheema scheme
Next Story