Jagananna: గోరుముద్దలో మరో పౌష్టికాహారం.. ప్రారంభించిన సీఎం జగన్‌

Jagananna Gorumudda: జగనన్న గోరుముద్ద పథకంలో రాగి జావ అందించే కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు.

Arun Chilukuri
Published on: 21 March 2023 3:22 PM IST
AP CM Jagan Launches Ragi Java in Jagananna Gorumudda
X

Jagananna: గోరుముద్దలో మరో పౌష్టికాహారం.. ప్రారంభించిన సీఎం జగన్‌

Jagananna Gorumudda: జగనన్న గోరుముద్ద పథకంలో రాగి జావ అందించే కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు. గోరుముద్ద కార్యక్రమాన్ని మరింతగా పటిష్టంగా అమలు చేసేలా అడుగులు వేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. నేటి నుంచి రాగిజావ కూడా పిల్లలకు అందిస్తున్నామన్నారు. గోరుముద్దను మరింత మెరుగ్గా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. పిల్లలకు ఐరన్‌, కాల్షియం పెరగడానికి ఈ ఆహారం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. 1 నుంచి 10 తరగతి పిల్లల వరకు దాదాపు 38లక్షల మంది పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని జగన్ తెలిపారు. తాజాగా రాగి జావ కోసం ఏటా మరో రూ.86 కోట్లు కలిపి మొత్తం రూ.1,910 కోట్లు వెచ్చిస్తూ పిల్లలకు పౌష్టికాహారాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story