వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకాలను ప్రారంభించిన సీఎం జగన్

వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకాలను ప్రారంభించిన సీఎం జగన్
x
Highlights

వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో సోమవారం...

వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పిల్లలకు హెల్దీ బాడీ, హెల్దీ మైండ్‌ చాలా అవసరమన్నారు. గర్భిణీల్లో 53 శాతం మందికి రక్తహీనత ఉందని.. తక్కువ బరువున్న పిల్లలు 32 శాతం మంది ఉన్నారు. రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న గర్భిణీలు, బాలింతలు, 6 నుంచి 72 నెలలలోపు పిల్లలకు పౌష్టికాహారం అందిస్తామని చదువు, ఆలోచనల్లో బలహీనులుగా ఉండకూడదనే ఈ పథకాలు తీసుకొచ్చామన్నారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా ఇంగ్లీష్‌ బోధన తీసుకొచ్చామన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ కేంద్రాలుగా మారుస్తామన్నారు. ఈ పథకాల కోసం ఏడాదికి రూ.1,863 కోట్లు ఖర్చుచేయనున్నట్లు చెప్పారు. గర్భిణులు, బాలింతలు, 6 నుంచి 72 నెలలలోపు పిల్లలకు పౌష్టికాహారం ఇస్తామని, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తామని చెప్పారు.


సీఎం ప్రసంగంలో ముఖ్యాంశాలు..

ఇవాళ ప్రారంభిస్తున్న వైయస్సార్‌ సంపూర్ణ పోషణ, వైయస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకాలు నిజంగా మంచి చేయడంలో సంతృప్తి ఇచ్చే కార్యక్రమాలు.

గతంలో పిల్లలు ఎలా ఉన్నారు? ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారా? లేదా? ఆరోగ్యంగా ఉన్నారా? వారి తల్లులు ఎలా ఉన్నారన్నది ఎవరూ ఆలోచన చేయలేదు. వారికి ఏం చేయాలన్నది ఆలోచించలేదు.

హెల్తీ బాడీ. హెల్తీ మైండ్‌. అన్నది ఎవ్వరూ పట్టించుకోలేదు.

చాలీ చాలని విధంగా నిధులు ఇచ్చేవారు.

ఏటా రూ.500 కోట్లు ఇస్తే ఎక్కువ అన్నట్లుగా ఉండేది.

మన పిల్లలు రేపటి పౌరులు, రేపటి ప్రపంచంతో వారు పోటీ పడే స్థితిలో ఉన్నారా? లేరా? అన్నది చూశాక వారిలో మార్పు తీసుకురావాలని అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం.

నేటి తరంలో చాలా మందికి మంచి ఆహారం లభించడం లేదు.

పిల్లలు, తల్లిదండ్రులు ఆ పరిస్థితిలో ఉన్నారు. వారందరిలో మార్పు తీసుకురావడం కోసమే ఈ పథకాలు.

పేదల పిల్లలకు బలహీనత, రక్తహీనత వంటి అనేక అనారోగ్య సమస్యలు ఉన్నాయి.

వాటికి సంబంధించి మన పిల్లలు ఎలా ఉన్నారన్నది చూస్తే, అలాగే తల్లుల పరిస్థితి చూస్తే.. గర్భవత్లులో దాదాపు 53 శాతం మంది రక్తహీనతతో బాధ పడుతున్నారు.

31.9 శాతం పిల్లలు తక్కువ బరువుతో జన్మించడం లేదా 5 ఏళ్ల వరకు అలాగే ఉంటున్నారు.

17.2 శాతం మంది పిల్లలు ఎత్తుకు తగ్గ బరువు లేరు. మరో 31 శాతం మంది పిల్లలు బరువుకు తగ్గ ఎత్తులో లేరు.

ఇంత దుస్థితి ఉంది, ఇవి కొత్తగా వచ్చినవి కావు, కానీ గతంలో పాలకులు ఏ మాత్రం పట్టించుకోలేదు.

ఈ నెంబర్లు మారాలి, పరిస్థితి మారాలి. పిల్లల ఎదుగుదల లేక, వారు వెనకబడి పోతున్నారు.

ఇంట్లో తినడానికి తగిన ఆహారం లేకపోతే, అది పిల్లల మేధస్సు, ఎదుగుదలలో కనిపిస్తోంది. తల్లిదండ్రులకు తగ్గట్లుగా పిల్లలు కూడా తగిన ఎదుగుదల లేక ఉన్నారు.

ఇవన్నీ తెలిసినా, గతంలో ఎవరూ పట్టించుకోలేదు. అందుకే ఈ ప్రభుత్వం ముందుకు అడుగు వేసింది. ఆ దిశలోనే పిల్లలు, గర్భిణీలు, బాలింతల బాగు కోసం ఈ పథకాలు.

55607 అంగన్‌వాడీల పరిధిలో పూర్తి మార్పులు చేస్తూ, పీపీ–1, పీపీ–2 ప్రారంభిస్తున్నాం.

బాగా డబ్బున్న వారి కుటుంబాల వారి పిల్లలు ప్రాథమిక స్థాయిలో రకరకాల చదువులు చదువుతున్నారు, పేద పిల్లలు అలాగే చదవాలన్న తపనతో ఈ మార్పులు చేస్తున్నాం.

పీపీ–1, పీపీ–2 ప్రారంభిస్తూ, ఇంగ్లిష్‌ మీడియమ్‌లో గట్టి పునాది వేసేలా అంగన్‌వాడీల్లో మార్పు చేస్తున్నాం.

Show Full Article
Print Article
Next Story
More Stories