సీఎం జగన్‌ కడప జిల్లా పర్యటన.. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు..

AP CM Jagan Kadapa Tour for Three Days From Today
x

సీఎం జగన్‌ కడప జిల్లా పర్యటన.. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు..

Highlights

Jagan: సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ్టి నుంచి 25వ తేదీ వరకు కడప జిల్లాలో పలు కార్యక్రమాల్లోనూ, క్రిస్మస్ వేడుకల్లోనూ పాల్గొంటారు.

Jagan: సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ్టి నుంచి 25వ తేదీ వరకు కడప జిల్లాలో పలు కార్యక్రమాల్లోనూ, క్రిస్మస్ వేడుకల్లోనూ పాల్గొంటారు. ఉదయం 9.45 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి 10.30 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. బొల్లవరం, బద్వేలు, కొప్పర్తిలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేస్తారు. సాయంత్రం 5.25 గంటలకు ఇడుపులపాయ గెస్ట్ హౌస్ కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.

శుక్రవారం తన తండ్రి వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి ప్రార్థనల్లో పాల్గొంటారు. ఇడుపులపాయ ప్రార్థనమందిరంలో జరిగే ప్రార్థనలకు కూడా సీఎం జగన్ హాజరవుతారు. అనంతరం, పులివెందులలో పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. తిరిగి ఇడుపులపాయ గెస్ట్ హౌస్ చేరుకుని అక్కడే బస చేయనున్నారు. ఇక, ఈ నెల 25న క్రిస్మస్ సందర్భంగా పులివెందుల ఈఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం సీఎస్ఐ చర్చి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వాణిజ్య సముదాయాన్ని ప్రారంభిస్తారు. అదే రోజు మధ్యాహ్నం కడప విమానాశ్రయానికి చేరుకుని గన్నవరం తిరుగు పయనమవుతారు.


Show Full Article
Print Article
Next Story
More Stories