పాదయాత్రలో నేతన్న కష్టాలు చూశా.. మూడోవిడత నిధుల్ని విడుదల చేసిన జగన్

Arun Chilukuri
Published on: 10 Aug 2021 2:11 PM IST
AP CM Jagan has Implemented the YSR Nethanna Nestham Third phase
X

వై ఎస్ జగన్ (ట్విట్టర్ ఫోటో)

YSR Nethanna Nestham: వైఎస్ఆర్ నేతన్న నేస్తం ద్వారా 80వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని సీఎం జగన్ వెల్లడించారు. తన పాదయాత్రలో చేనేతల కష్టాలు చూశానని, ఇచ్చిన మాట ప్రకారం చేనేతలకు ఆర్ధిక సాయం చేస్తున్నామని సీఎం అన్నారు. మూడో విడత కింద లబ్ధిదారుల ఖాతాల్లో రూ.192.08 కోట్లు జమ చేస్తున్నామన్నారు. అంటే ఒక్కో చేనేత కుటుంబానికి రూ.24వేల చొప్పున సాయం అందనుందని సీఎం జగన్ వివరించారు. భవిష్యత్‌లో కూడా ప్రతి చేనేత కుటుంబానికి అండగా ఉంటామని జగన్ హామీ ఇచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story