రేపు గుంటూరు, పల్నాడు జిల్లాలలో సీఎం జగన్ టూర్ షెడ్యూల్

AP CM Jagan Guntur and Palnadu Trip On June 7
x

రేపు గుంటూరు, పల్నాడు జిల్లాలలో సీఎం జగన్ టూర్ షెడ్యూల్

Highlights

Jagan Tour Schedule: సీఎం జగన్‌ రేపు గుంటూరు, పల్నాడు జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు.

Jagan Tour Schedule: సీఎం జగన్‌ రేపు గుంటూరు, పల్నాడు జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.40 గంటలకు గుంటూరుకు చేరుకుంటారు. 11.30 గంటల వరకు డాక్టర్‌ వైయస్‌ఆర్‌ యంత్రసేవా పథకం ద్వారా అందజేసిన ట్రాక్టర్‌లను, హర్వెస్టర్‌లను జెండా ఊపి ప్రారంభిస్తారు. ఇక మధ్యాహ్నం 12 గంటలకు పల్నాడు జిల్లా కొండవీడు చేరుకుని జిందాల్‌ ప్లాంటు సమీపంలో ఏర్పాటుచేసిన హరిత నగరాలు నమూనాని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత 12.30 గంటల మధ్య జిందాల్‌ వేస్ట్‌ టూ ఎనర్జీ ప్లాంట్‌ పైలాన్‌ ఆవిష్కరించి ప్లాంట్‌ను ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. సీఎం పర్యటన సందర్శంగా జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. లోటుపాట్లు లేకుండ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories