AP CM Jagan: చిరు వ్యాపారులకు అండగా నిలవడమే జగనన్న తోడు లక్ష్యం...

Jagananna Thodu: చిరువ్యాపారులకు చేయూతను అందించే జగనన్నతోడు పథకం కింద ముఖ్యమంత్రి జగన్ వడ్డీలేని రుణాలను పంపిణీ చేశారు.

Arun Chilukuri
Published on: 28 Feb 2022 11:52 AM IST
AP CM Jagan Disburses Interest Free Loans to Jagananna Thodu Beneficiaries
X

AP CM Jagan: చిరు వ్యాపారులకు అండగా నిలవడమే జగనన్న తోడు లక్ష్యం...

Jagananna Thodu: చిరువ్యాపారులకు చేయూతను అందించే జగనన్నతోడు పథకం కింద ముఖ్యమంత్రి జగన్ వడ్డీలేని రుణాలను పంపిణీ చేశారు. ప్రతియేటా ఒక్కొక్కరికి రూ.10వేల ఆర్థిక సాయంచేసే విధంగా రూపొందించిన ఈ పథకానికి 5 లక్షల 10 వేల462 మందిని లబ్ధిదారులుగా గుర్తించారు. ఈ పథకం కింద 510 కోట్ల 46 లక్షల రూపాయలు వడ్డీలేని రుణంతోపాటు 16 కోట్ల 16 లక్షల రూపాయలను వడ్డీ రీఎంబర్స్ మెంట్ కింద కలిపి మొత్తం 526 కోట్ల 62 లక్షల రూపాయలను ఆన్ లైన్ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమచేశారు. చిరు వ్యాపారులకు అండగా నిలవడమే జగనన్న తోడు లక్ష్యమని ముఖ్యమంత్రి జగన్‌ తెలిపారు. చిరు వ్యాపారులు తమకు తాము ఉపాధి కల్పించుకోవడం గొప్ప విషయమని అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story