Jagan Delhi Tour: నెల తిరక్క ముందే ఢిల్లీ నుంచి జగన్‌కు పిలుపు

Jagan Delhi Tour: సీఎం జగన్ ఈ వారంలో ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందా.... ?

Arun Chilukuri
Updated on: 27 July 2021 3:11 PM IST
AP CM Jagan Delhi Tour Soon
X

Jagan Delhi Tour: నెల తిరక్క ముందే ఢిల్లీ నుంచి జగన్‌కు పిలుపు

Jagan Delhi Tour: సీఎం జగన్ ఈ వారంలో ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందా.... ? ఢిల్లీ నుంచి సీఎంకు పిలుపు వచ్చిందా అంటే ప్రస్తుత పరిస్థితి అవుననేలా ఉంది. పార్లమెంట్‌లో వైసీపీ తమ గళాన్ని బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో సీఎం జగన్‌కు ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు రావడం చర్చనీయాంశంగా మారింది.

సీఎం ఢిల్లీ వెళ్లి నెల కూడా పూర్తి కాలేదు మళ్లీ పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌లో ఏపీ సమస్యలపై గట్టిగా మాట్లాడుతున్న నేపథ్యంలో జగన్‌కు పిలుపు రావడం చర్చకు దారి తీసింది. విశాఖ స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా అంశాలపై పార్లమెంట్‌లో ఎంపీలు ఇప్పటికే ఆందోళన చేశారు. ఇక దేశంలో ఉన్న సమస్యల కన్నా ఏపీ సమస్యలే ప్రధాన అజెండాగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి.

ప్రస్తుతం దేశంలో ఉన్న అనేక సమస్యలే అజెండాగా విపక్షాలు ముందుకు వెళుతుంటే ఏపీకి సంబంధించిన సమస్యలపై ఎంపీలు పోరాడుతున్నారు. దీంతో పార్లమెంట్ సమావేశాలు ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్నాయి. అంతేకాక వచ్చె నెల మొదటి వారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైజాగ్ ‌స్టీల్ ప్లాంట్ ఆందోళనలు చేపడితే కేంద్రానికి ఇబ్బందులు తప్పవని గ్రహించిన కేంద్రం జగన్‌తో చర్చించనున్నట్లు సమాచారం. ఇలాంటి పలు అంశాలపై కేంద్రం జగన్‌తో చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో సీఎం జగన్‌కు ఢిల్లీ నుంచి పిలుపు రావడం హాట్‌ టాపిక్‌గా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story