బెస్ట్ గ్రామ వాలంటీర్లకు ఉగాదినాడు పురస్కారాలు: సీఎం జగన్

బెస్ట్ గ్రామ వాలంటీర్లకు ఉగాదినాడు పురస్కారాలు: సీఎం జగన్
x

బెస్ట్ గ్రామ వాలంటీర్లకు ఉగాదినాడు పురస్కారాలు: సీఎం జగన్

Highlights

గ్రామ సచివాలయాల్లోని డేటా క్రోడీకరణ చేయాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రణాళిక శాఖపై క్యాంపు కార్యాలయంలో అధికారులతో సీఎం జగన్ సమీక్ష...

గ్రామ సచివాలయాల్లోని డేటా క్రోడీకరణ చేయాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రణాళిక శాఖపై క్యాంపు కార్యాలయంలో అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. నిర్దేశిత లక్ష్యాలపై అధికారులు దృష్టి సారించాలన్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లోని డేటా రికార్డు బాధ్యతను డిజిటల్ అసిస్టెంట్ కు అప్పగించాలని సూచించారు. మండల స్థాయిలో ఉన్న ఉద్యోగి సూపర్ వైజ్ చేస్తారన్నారు. ఆర్బీకేల పరిధిలో చేస్తున్న ఇ-డేటాను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. గ్రామాల్లోని ప్రభుత్వ వ్యవస్థల దగ్గర ఇంటర్నెట్ సరిగ్గా పని చేస్తుందా లేదా అన్న డేటా కూడా ఎప్పటికప్పుడు రావాల్సి ఉందని సీఎం జగన్ అన్నారు. దీని వల్ల పాలన, పని తీరు సమర్ధవంతంగా ముందుకు సాగుతుందన్నారు. సుస్దిర సమగ్ర అభివృద్ధి కోసం ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన 17 లక్ష్యాలను అందుకునే విధంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయని అధికారులు సీఎం కు వివరించారు.

ప్రభుత్వ లక్ష్యాలను చేరుకునే క్రమంలో ఐక్యరాజ్యసమితి దాని అనుబంధ విభాగాలు సహా ప్రపంచస్థాయి సంస్థల భాగస్వామ్యం తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్, యునెస్కోలాంటి సంస్థలతోకూడా కలిసి పనిచేయాలని సూచించారు. డేటాను కేవలం సేకరించడమే కాకుండా ఆ డేటా ద్వారా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిపెట్టాలన్నారు. వివిధ కార్యక్రమాల్లో ఎంతవరకూ లక్ష్యాన్ని చేరుకున్నాం లోపాలేమిటో గుర్తించాలన్నారు. వాటిని ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. ఉగాది రోజున వాలంటర్లను సత్కరించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. వాలంటీర్ల సేవలను ప్రోత్సాహకాలతో గౌరవించాలని సేవా రత్న, సేవా మిత్ర పేరుతో వాలంటీర్లను సత్కరించాలని అధికారులకు సూచన చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories