Krishna Water Row: సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు.. టీఆర్ఎస్ నేతలు..

Krishna Water Row: ఏపీ సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Updated on: 30 Jun 2021 3:32 PM IST
AP CM Jagan Comments on TRS Leaders Over Krishna Water Row
X

జగన్(ఫైల్ ఇమేజ్ )

Krishna Water Row: ఏపీ సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాల వివాదంపై స్పందించిన ఆయన.. టీఆర్ఎస్ నేతలు దూకుడు వ్యాఖ్యలు చేస్తున్నారని పండిపడ్డారు. తెలంగాణలో ఏపీ ప్రజలున్నారని ఆలోచిస్తున్నామని, సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. రైతులు నష్టపోతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటామన్న జగన్‌ వివాద పరిష్కారానికి సూచనలు చేయాలని మంత్రులను సూచించారు.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదంపై ఏపీ కేబినెట్ తీర్మారం చేసింది. ఏపీ హక్కులకు సంబంధించి రాజీ పడేది లేదని మంత్రివర్గం స్పష్టం చేసింది. శ్రీశైల జలవిద్యుత్ ఉత్పత్తి విషయంలోనూ తెలంగాణ వైఖరిని తప్పుబట్టింది ఏపీ కేబినెట్. తెలంగాణ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని కేబినెట్ నిర్ణయించింది. ఇదే విషయంపై ప్రధాని మోడీకి లేఖ రాయాలని మంత్రివర్గం నిర్ణయించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story