Jagan: సచివాలయాల సందర్శనపై ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

Jagan: గ్రామ, వార్డు సచివాలయాల సందర్శనపై ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 6 July 2021 5:20 PM IST
AP CM Jagan Comments on Secretariat Visit
X

జగన్(ఫైల్ ఇమేజ్ )

Jagan: గ్రామ, వార్డు సచివాలయాల సందర్శనపై ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ తగ్గుముఖం పట్టగానే తాను కూడా వారానికి రెండు సార్లు సచివాలయాలను సందర్శిస్తానన్నారు. ఎమ్మెల్యేలు, అధికారులను కలిపి మండలస్థాయిలో ప్రతిరోజూ ఒక గ్రామ, వార్డు సచివాలయాన్ని సందర్శించే కార్యక్రమం చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. అలాగే, కోవిడ్ థర్డ్‌వేవ్‌పై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

థర్డ్‌వేవ్‌ ఎప్పుడు వస్తుందో తెలీదన్న జగన్ వ్యాక్సినేషన్ సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. ఎకనామిక్ ఆక్టివిటీ పెరగాలని, లేకపోతే పేదలు ఇబ్బంది పడతారని వ్యాఖ్యానించారు. అలాగే, దిశ యాప్, మహిళల భద్రతపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ఈ నెల 9 నుంచి 23 వరకూ రైతు భరోసా యాత్రలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story