విద్యార్థుల ఆంగ్ల భాషా ప్రావీణ్యానికి ముగ్ధుడైన సీఎం జగన్

Jagan: కాకినాడ జిల్లా బెండపూడి ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులు కొందరు సీఎం జగన్ ను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు.

Arun Chilukuri
Updated on: 19 May 2022 7:00 PM IST
AP CM Jagan Chats With Bendapudi Zilla Parishad High School Students
X

విద్యార్థుల ఆంగ్ల భాషా ప్రావీణ్యానికి ముగ్ధుడైన సీఎం జగన్

Jagan: కాకినాడ జిల్లా బెండపూడి ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులు కొందరు సీఎం జగన్ ను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. వారు సీఎం ఎదుట ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడిన వైనం అందరినీ ఆకట్టుకుంటోంది. వారు ఎలాంటి తడబాటు లేకుండా సీఎం జగన్ తో ఇంగ్లీషులో మాట్లాడారు. అమ్మ ఒడి, ఆంగ్ల మాధ్యమంలో బోధన, నాడు-నేడు పథకాల విశిష్టతను ఇంగ్లీషులో చక్కగా వివరించారు. ఇలాంటి పథకాలతో అందరికీ స్ఫూర్తిగా నిలిచారంటూ సీఎం జగన్ ను ప్రస్తుతించారు. విద్యార్థుల ఆంగ్ల భాషా ప్రావీణ్యాన్ని ఆద్యంతం చిరునవ్వుతో ఆస్వాదించిన సీఎం జగన్, ఆ విద్యార్థులను మనస్ఫూర్తిగా అభినందించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story