Andhra Pradesh: మన బాధ్యత మరింత పెరిగింది- సీఎం జగన్‌

Andhra Pradesh: రాజకీయ పదవుల్లో మహిళలకు పెద్దపీట వేశామన్నారు ఏపీ సీఎం జగన్.

Arun Chilukuri
Published on: 1 April 2021 4:54 PM IST
AP CM Jagan Attends Mayors Awareness Seminar in Vijayawada
X

Andhra Pradesh: మన బాధ్యత మరింత పెరిగింది- సీఎం జగన్‌

Andhra Pradesh: రాజకీయ పదవుల్లో మహిళలకు పెద్దపీట వేశామన్నారు ఏపీ సీఎం జగన్. విజయవాడలో మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఛైర్మన్ల వర్క్‌షాప్‌లో నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు సీఎం దిశానిర్ధేశం చేశారు. ప్రజల దీవెనలతో విజయం సాధించామన్న జగన్ వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు ఉంచిన నమ్మకంతో మరింత బాధ్యత పెరిగిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 78శాతం పదవులు ఇచ్చినట్లు జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చెత్త సేకరణకు 8 వేల వాహనాలను కేటాయించాం. ప్రతి ఇంటికీ రక్షిత మంచినీరు అందించాలి. అవినీతి, వివక్ష ఎట్టిపరిస్థితుల్లో ఉండకూడదని సీఎం అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story