తుపాన్‌ మృతులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా

Arun Chilukuri
Published on: 28 Nov 2020 3:37 PM IST
తుపాన్‌ మృతులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా
X

నివర్‌ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం స్థానిక అధికారులతో పంటనష్టంపై సుదీర్ఘంగా చర్చించారు. పంటనష్టాన్ని పరిశీలించామన్న సీఎం జగన్‌ ప్రతిఒక్క వరద బాధితుడిని మానవతాధృక్పథంతో చూడాలన్నారు. తుపాను ప్రభావంతో చిత్తూరు జిల్లాలో ఆరుగురు, కడప జిల్లాలో ఇద్దరు మృతి చెందారని వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు 5లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియాను వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రతిఒక్కరికి రూ.500 చొప్పున తక్షణ సాయం ప్రకటించాలన్నారు. పంట నష్టంపై తక్షణం అంచనాలు వేసి నివేదిక అందించాలని అధికారులను కోరారు. దెబ్బతిన్న ప్రాజెక్టుల వద్ద యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని సూచించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story