నెల రోజుల ముందే సంక్రాంతి పండుగ వచ్చినట్టుంది: సీఎం జగన్

నెల రోజుల ముందే సంక్రాంతి పండుగ వచ్చినట్టుంది: సీఎం జగన్
x
Highlights

బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ ప్రమాణ స్వీకారం చూస్తుంటే సంక్రాంతి పండుగ నెల రోజుల ముందే వచ్చినట్టుందని సీఎం జగన్ తెలిపారు. మహిళా అభ్యుదయంలో...

బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ ప్రమాణ స్వీకారం చూస్తుంటే సంక్రాంతి పండుగ నెల రోజుల ముందే వచ్చినట్టుందని సీఎం జగన్ తెలిపారు. మహిళా అభ్యుదయంలో కొత్త చరిత్ర సృష్టించామన్నారు. బీసీ కార్పొరేషన్ చైర్మన్‌లలో అత్యధికంగా మహిళలకే అధిక ప్రాధాన్యం ఇచ్చామన్నారు. బీసీలంటే వెనకబడిన కులాలు కాదని సంస్కృతికి, సంప్రదాయలకు వెన్నెముక లాంటి కులాలని సీఎం జగన్ తెలిపారు.

బలహీన వర్గాలను బలపర్చడంలో మరో అడుగు ముందుకు వేశామని సీఎం జగన్ తెలిపారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను 90 శాతం పూర్తి చేశామన్నారు. రైతుల భరోసా కేంద్రాల ద్వారా అన్నదాతలకు దన్నుగా ఉన్నామని సీఎం జగన్ అన్నారు. ఇళ్ల పట్టాలు ఒక యజ్ఞంలా చేస్తున్నామన్నారు సీఎం జగన్. ప్రతి ఒక్కరికి ఇళ్లు ఉండాలనే ఉద్దేశంతో ఇళ్ల స్థలాలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం ఈ నెల 25న 31 లక్షల పైగా ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. 15 రోజుల్లో కార్యక్రమం పూర్తి కావాలన్నారు. 15లక్షల 92 వేల మందికి లబ్ధి చేకూరుతోందన్నారు.

ఇన్‌సైడ్ ట్రేడింగ్ పేరుతో బాబు అక్రమాలకు పాల్పడ్డారని జగన్ విమర్శించారు. తన బినామీలతో భూములు కొనుగోలు చేయించి రాజధాని ఏర్పాటు చేయాలని చూశారని చంద్రబాబును ఉద్దేశించి సీఎం జగన్ విమర్శల అస్త్రలు విసిరారు. భూములు కాపాడుకునేందుకే అమరావతి రాజధాని ఉద్యమానికి నాంది పలికారని వెల్లడించారు. చనిపోయిన బుర్ర పనిచేస్తే ఎలా ఉంటుందో అక్కడ కనిపిస్తుందని మంచి బుర్ర పని చేస్తే ఎలా ఉంటుందో ఇక్కడ కనిపిస్తుందని జగన్ ఎద్దేవా చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories