ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు లేఖ

ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు లేఖ
x
Highlights

ప్రధాని మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. అడుగు పెడితే నిరసనలు ఎదుర్కోనే దుస్థితి అత్యున్నత పదవిలో ఉండేవారికి కలగరాదని ఆ లేఖలో తెలిపారు చంద్రబాబు....

ప్రధాని మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. అడుగు పెడితే నిరసనలు ఎదుర్కోనే దుస్థితి అత్యున్నత పదవిలో ఉండేవారికి కలగరాదని ఆ లేఖలో తెలిపారు చంద్రబాబు. ఓటమిని ఎదుర్కోగల గుండె ధైర్యం మోదీలో పెరిగాలని కోరారు. పతనావస్థలోకి జారుకున్న మోదీ.. సంయమనం కోల్పోవడం సహజమేనంటూ తన ఐదు పేజీలో లేఖలో పేర్కొన్నారు. ప్రధాని పర్యటన ఆహ్వాన ప్రకటనల్లో సీఎం పేరు కూడా వేయని దుష్ట సంస్కృతికి తెరతీశారు. హోదా కోసం ఆత్మహత్యలు చేసుకున్నవారికి సానుభూతి కూడా వ్యక్తం చేయలేదంటూ లేఖలో పేర్కొన్నారు. మరోవైపు నేడు ఢిల్లీ వేదికగా జరగనున్న ధర్మపోరాట దీక్షకు పలు పార్టీలు మద్దతు తెలపనున్నాయి. కాంగ్రెస్‌ అధ్యక్షడు రాహుల్‌ గాంధీ, టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ, డీఎంకే నేత కనిమోళి, ఎస్పీ అగ్రనేత ములాయం సింగ్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అగ్రనేత ఫరూక్‌ అబ్దుల్లా, బీఎస్పీ అధినేత్రి మాయావతితో పాటు పలువురు జాతీయ నేతలకు లేఖలు రాశారు ముఖ్యమంత్రి చంద్రబాబు.ap-cm-chandrababunaidu-write-a-letter-to-pm-modi

Show Full Article
Print Article
Next Story
More Stories