AP News: ఏపీలో పోలీస్ వ్యవస్థ పటిష్టం, మహిళా భద్రతపై సీఎం చంద్రబాబు సమీక్ష

AP News: మహిళా కళాశాలలు, వైద్యశాలల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆదేశం

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 21 Aug 2024 7:46 PM IST
Ap Cm Chandrababu Review On Home Department
X

AP News: ఏపీలో పోలీస్ వ్యవస్థ పటిష్టం, మహిళా భద్రతపై సీఎం చంద్రబాబు సమీక్ష

AP News: ఏపీలో పోలీస్ వ్యవస్థ పటిష్టం, మహిళా భద్రతపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మహిళా కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, వైద్యశాలల్లో పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశించినట్టు హోంమంత్రి అనిత తెలిపారు. నేరస్థులను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం కోసం..10 కోట్లు కేటాయించారన్నారు. నేర నిర్దారణ కోసం ఎన్ని సీసీ కెమెరాలు అవసరం అవుతాయో 15 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని సీఎం ఆదేశించినట్టు మంత్రి వెల్లడించారు. అవసరం అయిన మేర పోలీస్ వాహనాల కొనుగోలుకు ముఖ్యమంత్రి అనుమతి ఇచ్చారన్నారు. విజయవాడలో పోలీస్ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నట్టు హోంమంత్రి అనితి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో న్యాయం జరగలేదని భావించిన కేసులను తిరిగి రీఓపెన్ చేస్తామన్నారు హోంమంత్రి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story