Chandrababu: ఏపీలో మద్యం అక్రమాలపై సీఐడీతో విచారణ జరిపిస్తాం

Chandrababu: ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎక్సైజ్ పాలసీపై అసెంబ్లీలో శ్వేతపత్రం రిలీజ్ చేశారు సీఎం చంద్రబాబు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 24 July 2024 8:45 PM IST
AP CM Chandrababu Released White Paper on Excise Department
X

Chandrababu: ఏపీలో మద్యం అక్రమాలపై సీఐడీతో విచారణ జరిపిస్తాం

Chandrababu: ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎక్సైజ్ పాలసీపై అసెంబ్లీలో శ్వేతపత్రం రిలీజ్ చేశారు సీఎం చంద్రబాబు. మద్యం పాలసీలో జగన్ ప్రభుత్వం అడుగడుగునా తప్పిదాలు చేసిందని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచి పేదల జేబులు చోరీ చేశారని అసహనం వ్యక్తం చేశారు. ఐదు టాప్ బ్రాండ్లను తరిమేసి భూం భూం పేరుతో రకరకాల బ్రాండ్లు తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నగదు చెల్లింపులో ఆన్ లైన్ విధానం పెట్టకుండా మరో తప్పిదం చేసిందన్నారు చంద్రబాబు. మద్యం వల్ల గత ఐదేళ్లలో ఎంతమంది ఆరోగ్యం దెబ్బతిన్నదో, ఎంత మంది చనిపోయారో లెక్కలు తీస్తామని వెల్లడించారు. ఈ లిక్కర్ అంశంలో సీబీ-సీఐడీ ఎంక్వైరీకి ఆదేశంతో పాటు ఈడి ఎంక్వైరీ కూడా కోరుతామన్నారు చంద్రబాబు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story