Chandrababu to Sri City: నేడు శ్రీసిటీకి చంద్రబాబు.. 15 సంస్థల కార్యకలాపాలు ప్రారంభించనున్న సీఎం..

Chandrababu to Sri City: ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ తిరుపతిలో పర్యటించనున్నారు. నగరంలోని శ్రీ సిటీలో పలు పరిశ్రమలకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

Arun Chilukuri
Updated on: 19 Aug 2024 10:45 AM IST
Chandrababu to Sri City: నేడు శ్రీసిటీకి చంద్రబాబు.. 15 సంస్థల కార్యకలాపాలు ప్రారంభించనున్న సీఎం..
X

Chandrababu to Sri City: ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ తిరుపతిలో పర్యటించనున్నారు. నగరంలోని శ్రీ సిటీలో పలు పరిశ్రమలకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు 8 పరిశ్రమలకు భూమిపూజ చేయనుండగా... 16 పరిశ్రమలను ప్రారంభించనున్నారు. అనంతరం ఫాక్స్ కాన్ ప్రతినిధులతో పాటు పలు పరిశ్రమల సీఈవోలతో సీఎం సమావేశమవుతారు.

5 పరిశ్రమల ఏర్పాటుకు ఎంవోయూలు కుదుర్చుకుంటారు. ఆయా సంస్థల ద్వారా 900 కోట్ల పెట్టుబడితో 2వేల,740 మందికి ఉపాధి లభించనుంది. మరో వెయ్యి 2వందల 13 కోట్ల పెట్టుబడికి ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోనుంది. ఇవాళ్టి పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు శ్రీ సిటీ బిజినెస్ సెంటర్ లో పలు కంపెనీల సీఈవోలతో సమావేశం కానున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story