CM Chandrababu: ఈ నెల 28న అయోధ్యకు సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఈ నెల 28న అయోధ్యకు సీఎం చంద్రబాబు
x

CM Chandrababu: ఈ నెల 28న అయోధ్యకు సీఎం చంద్రబాబు

Highlights

CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు అయోధ్య పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 28న అయోధ్యకు వెళ్లనున్నట్లు అధికారుల సమాచారం.

CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు అయోధ్య పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 28న అయోధ్యకు వెళ్లనున్నట్లు అధికారుల సమాచారం. అక్కడ రామజన్మభూమిని చంద్రబాబు సందర్శించనున్నారు. ఆ రోజు ఉదయం హైదరాబాద్‌ నుంచి అయోధ్య వెళ్లి తిరిగి సాయంత్రం విజయవాడకు చేరుకోనున్నారు. పర్యటనకు సంబంధించిన మరిన్ని విషయాలు అధికారికంగా పూర్తి సమాచారం రావాల్సి ఉంది.

అలగే ఈ నెల 26న తిరుపతిలో పర్యటించనున్నారు. ‘భారతీయ విజ్ఞాన సమ్మేళనం' కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ఈ మేరకు అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే తిరుపతిలో పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. తిరుపతి నగరానికి వస్తున్న ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన ముగిసేంత వరకు భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories