అమిత్ షాతో సీఎం చంద్రబాబు కీలక భేటీ: అమరావతికి చట్టబద్ధతపై చర్చ.. బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు?

Chandrababu: దేశ రాజధానిలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.
Chandrababu: దేశ రాజధానిలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. దాదాపు గంటకు పైగా సాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన అత్యంత కీలకమైన అంశాలపై చర్చలు జరిగాయి. ప్రధానంగా రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లు సమాచారం.
అమరావతిపై పార్లమెంట్లో బిల్లు!
అమరావతిని రాజధానిగా స్థిరీకరిస్తూ, దానికి చట్టబద్ధత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పార్లమెంట్లో బిల్లు పెట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో, రాబోయే బడ్జెట్ రెండో దశ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టాలని అమిత్ షాను ముఖ్యమంత్రి కోరినట్లు తెలుస్తోంది. బిల్లుకు సంబంధించిన సాంకేతిక, న్యాయపరమైన అంశాలపై ఇద్దరు నేతల మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది.
రాష్ట్ర ప్రయోజనాలపై విన్నపం
అమరావతితో పాటు రాష్ట్ర విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు, ఏపీకి అందాల్సిన ఆర్థిక ప్యాకేజీలు, భద్రతాపరమైన అంశాలపై కూడా చంద్రబాబు చర్చించారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం వంటి రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులను కూడా హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ భేటీతో రాష్ట్రానికి సంబంధించి పలు కీలక ప్రాజెక్టులకు కేంద్రం నుంచి మరింత మద్దతు లభిస్తుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



