CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. ఐదుగురు కేంద్రమంత్రులతో వరుస భేటీలు

AP CM Chandrababu Naidu Delhi Visit: సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.
AP CM Chandrababu Naidu Delhi Visit: సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఐదుగురు కేంద్రమంత్రులతో విరివిగా భేటీ కానున్నారు. కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు.. రాష్ట్రానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు, జలజీవన్ మిషన్ పథకానికి నిధులు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిపై చర్చిస్తున్నారు. ఆయనతో భేటీ అనంతరం నిర్మలా సీతారామన్, శివరాజ్ సింగ్, అశ్వినీ వైష్ణవ్లతో భేటీ అయి రాష్ట్రానికి సంబంధించి పలు ప్రాజెక్టులకు అందాల్సిన సహాయం, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించిన ప్రస్తావనలపై కేంద్రమంత్రులతో చర్చించనున్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీలో తాజాగా నెలకొన్న రాజకీయ పరిణామాలు, తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై చర్చించనున్నట్లు సమాచారం. కేంద్రమంత్రులతో సమావేశాలు ముగిశాక సీఎం తిరిగి ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి గన్నవరం చేరుకుని, అక్కడి నుంచి ఉండవల్లి నివాసానికి వెళ్తారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



