అనంతపురం జిల్లాలో రథం దగ్ధం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Chariot Catches Fire: అనంతపురం జిల్లా కనేకల్‌లో రథం దగ్ధం ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 24 Sept 2024 12:45 PM IST
AP CM Chandrababu Key Orders To Officers Over Chariot Fire
X

అనంతపురం జిల్లాలో రథం దగ్ధం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Chariot Catches Fire: అనంతపురం జిల్లా కనేకల్‌లో రథం దగ్ధం ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. దుండగులు నిప్పు పెట్టడంతో రథం కాలిపోయినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. రథం దగ్ధం ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించిన చంద్రబాబు..వెంటనే ఘటనాస్థలికి వెళ్లి విచారణ చేయాలని కలెక్టర్‌, ఎస్పీని కోరారు. దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలన్నారు.

కాగా అనంతపురం జిల్లా కనేకల్ మండలం హనకనహాల్ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి శ్రీ రామాలయం రథానికి నిప్పు పెట్టారు గుర్తు తెలియని దుండగులు. ఇది గమనించిన స్థానికులు మంటలను అదుపు చేశారు. ఘటనలో రథం సగానికి పైగా దగ్ధమయ్యింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story