Chandrababu: మన్‌ కీ బాత్‌ తరహాలో ఏపీ ప్రజల ముందుకు సీఎం చంద్రబాబు..!

Chandrababu: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహిస్తున్న మన్ కీ బాత్ తరహాలోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రజలతో నేరుగా మాట్లాడనున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 21 Nov 2024 12:32 PM IST
AP CM Chandrababu Planing to New Program Like Mann Ki Baat
X

Chandrababu: మన్‌ కీ బాత్‌ తరహాలో ఏపీ ప్రజల ముందుకు సీఎం చంద్రబాబు..!

Chandrababu: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహిస్తున్న మన్ కీ బాత్ తరహాలోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రజలతో నేరుగా మాట్లాడనున్నారు. సంక్రాంతి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయి. ఆయన హయాంలోనే 1995 నుంచి 2004 మధ్య డయల్ యువర్ సీఎం నిర్వహించారు.

ఇప్పుడు మన్ కీ బాత్, డయల్ యువర్ సీఎం కార్యక్రమాల కలయిక ద్వారా ప్రజలతో మమేకం అయ్యేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. త్వరలోనే ప్రజలతో ముఖా ముఖి సమావేశాలు నిర్వహించనున్నట్లు అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆడియో గానీ వీడియో విధానంలో గానీ ఈ కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉంది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story