చంద్రబాబు సోదరుడి ఆరోగ్య పరిస్థితి విషయం.. హైదరాబాద్‌కు ఏపీ సీఎం

Ramamurthy Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోదరులు రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం విషమంగా ఉంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 16 Nov 2024 12:05 PM IST
Ap Cm Chandrababu Brother Rammurthy Naidu Health Is Critical
X

చంద్రబాబు సోదరుడి ఆరోగ్య పరిస్థితి విషయం.. హైదరాబాద్‌కు ఏపీ సీఎం

Ramamurthy Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోదరులు రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం విషమంగా ఉంది. ఆయనను హైద్రాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ విషయం తెలుసుకున్న ఏపీ మంత్రి నారా లోకేష్ హైద్రాబాద్ కు బయలుదేరారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో శనివారం చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది. ఈ విషయం తెలిసిన చంద్రబాబు మహరాష్ట్ర పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇవాళ మధ్యాహ్నానికి ఆయన హైద్రాబాద్ కు చేరుకుంటారు.

1994 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్దిగా ఆయన గెలిచారు. ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సినీ హీరో నారా రోహిత్ రామ్మూర్తి నాయుడి కొడుకు. గత నెలలోనే రోహిత్ వివాహం జరిగింది.

ఆసుపత్రికి చేరుకున్న లోకేష్

హైద్రాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి నారా లోకేష్ చేరుకున్నారు. తన బాబాయ్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను ఆయన అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు కుటుంబసభ్యులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. అసెంబ్లీతో పాటు ఇతర కార్యక్రమాలను ఆయన రద్దు చేసుకున్నారు. రెండు రోజుల క్రితమే రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు సమాచారం ఇచ్చారు. అయితే కొద్దిసేపటికి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు సమాచారం ఇచ్చారు. దీంతో చంద్రబాబు హైద్రాబాద్ పర్యటనను రద్దు చేసుకున్నారు. దిల్లీకి వెళ్లే సమయంలో చంద్రబాబు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story