ఫైబర్‌ గ్రిడ్‌ కేసులో దూకుడు పెంచిన ఏపీ సీఐడీ.. చంద్రబాబు సన్నిహితుల ఆస్తుల అటాచ్‌కు నిర్ణయం

AP CID Contemplates to Attach Assets in Fibernet Case
x

ఫైబర్‌ గ్రిడ్‌ కేసులో దూకుడు పెంచిన ఏపీ సీఐడీ.. చంద్రబాబు సన్నిహితుల ఆస్తుల అటాచ్‌కు నిర్ణయం

Highlights

Fiber Grid Case: ఫైబర్‌ గ్రిడ్‌ కేసులో ఏపీ సీఐడీ దూకుడు పెంచింది.

Fiber Grid Case: ఫైబర్‌ గ్రిడ్‌ కేసులో ఏపీ సీఐడీ దూకుడు పెంచింది. చంద్రబాబు నాయుడు సన్నిహితులకు చెందిన ఏడు స్థిరాస్తులను అటాచ్‌ చేయాలన్న ప్రతిపాదనకు అనుమతి కోసం నేడు ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయాలని సీఐడీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సీఐడీ ప్రతిపాదనకు హోంశాఖ ఆమోదం తెలిపింది. టెరాసాఫ్ట్‌ కంపెనీతోపాటు చంద్రబాబు సన్నిహితులకు చెందిన ఏడు స్థిరాస్తులను అటాచ్‌ చేయాలన్న సీఐడీ ప్రతిపాదనకు రాష్ట్ర హోంశాఖ ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అటాచ్‌ చేయాలన్న ప్రతిపాదనల్లో గుంటూరులో ఇంటి స్థలం, విశాఖపట్నంలో ఓ ఫ్లాట్, హైదరాబాద్‌లోని నాలుగు ఫ్లాట్లు, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలోని వ్యవసాయ భూమి ఉన్నాయి. అయితే ఏసీబీ కోర్టు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.

Show Full Article
Print Article
Next Story
More Stories