నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక బిల్లులకు ఆమోదం

నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక బిల్లులకు ఆమోదం
x
Highlights

ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కానుంది.

ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కానుంది. పలు కీలక బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. ముఖ్యంగా మహిళల భద్రత కోసం రూపొందించిన ముసాయిదా బిల్లు, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమీషన్లు ఏర్పాటు చేసే బిల్లు, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ చెల్లింపు ఆమోదం పొందే అవకాశం ఉంది. కేబినెట్ భేటీ తర్వాత అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై సిఎం జగన్ మంత్రులకు మార్గనిర్దేశం చేస్తారు.

మరోవైపు అసెంబ్లీ సమావేశాలు మూడవ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వంలో కన్సల్టెంట్ల నియామకం, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మాధ్యమం, రాయలసీమ జిల్లాల్లోని జలాశయాలను నింపడం గురించి టీడీపీ ప్రశ్నలు సిద్ధం చేస్తుంది.

వైయస్ఆర్ రైతు భరోసా పథకం మరియు ఎల్ఇడి బల్బుల సరఫరా విషయంలో ప్రభుత్వాన్ని తప్పుబడుతోంది. గ్రామ కార్యదర్శులు, గ్రామ వాలంటీర్లు, ఉద్యోగాల కల్పనపై స్వల్పకాలిక చర్చ ఉంటుంది.అమరావతిలో హ్యాపీ నెస్ట్ ప్లాట్లపై శాసనమండలిలో ప్రశ్నలను లేవనెత్తనుంది టీడీపీ. అలాగే రాష్ట్రంలో ఉల్లి ధరలు, అమరావతి నిర్మాణంపై శాసనమండలిలో స్వల్పకాలిక చర్చ జరగనుందని సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories